హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో వర్షాలు'

ASR: అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మి తెలిపారు. భారత వాతావరణ పరిశోధనా కేంద్రం నుంచి ఈ మేరకు అధికారిక సమాచారం అందిందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.