హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో 4 గంటల్లో సర్వదర్శనం

TPT: తిరుమల శ్రీవారిని 75,640 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,439 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చింది. 4.04 లక్షల లడ్డూలు విక్రయించగా, 1.66 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు. అశ్విని ఆసుపత్రిలో 2,329 మందికి వైద్యసేవలు అందించారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది.