హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవంబర్ 26న సెలవు: కలెక్టర్

కాకినాడ కార్పొరేషన్ పోలింగ్ సందర్భంగా నవంబర్ 26న స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కర్మాగారాలు, బ్యాంకుల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాలుగా గుర్తించిన విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.