హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ సూచనలు

VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బొబ్బిలి DSP రాకోటి గోవిందరావు పలు సూచనలు చేశారు. సోమవారం స్దానిక పిరిడి గ్రామంలో పర్యటించిన ఆయన ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని సూచించారు.