హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పౌర్ణమి ఎఫెక్ట్.. ఒక్క అత్తం రూ.800

కోనసీమ: కార్తీక పౌర్ణమి సందర్భంగా మామిడికుదురు మండలంలో 11 కాయల కర్పూర అరటి అత్తానికి భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా అరటి గెలల్లో 12 నుంచి 16 కాయలు ఉంటాయి. 11 కాయలు మాత్రమే ఉన్న అత్తం దొరకడం అరుదు. ఏకాదశ రుద్రుల స్వరూపంగా భావించే ఈ అత్తాన్ని శివుడికి సమర్పిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. మామిడికుదురులో ఇది రూ.800 ధర పలికింది.