WG: ఆకివీడు శివారులోని గాలిబ్ చెరువు ప్రాంతంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గణపవరం మండలం సరిపల్లి ప్రాంతంలోని వడ్డిగూడెంకు చెందిన చిటికెన వీర వెంకట శివ (30) అనే యువకుడు వేప చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఘటనా స్థలానికి ఆకివీడు CI కాళీ చరణ్, SI శుభశేఖర్ వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య


