హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజుల్లో 8,194 నామినేషన్లు దాఖలు

SKLM: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజైన సోమవారం సర్పంచ్‌ పదవులకు 422, వార్డు సభ్యులకు 1,775 కలిపి మొత్తం 2,197 నామినేషన్లు దాఖలయ్యాయి.దీంతో మూడు రోజుల్లో సర్పంచ్‌ స్థానాలకు 1,758, వార్డు స్థానాలకు 6,436 కలిపి మొత్తం 8,194 నామినేషన్లు అందినట్లు DPO స్వరూప రాణి ప్రకటనలో తెలిపారు.