హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఐదు రోజులు తేలికపాటి వర్షాలు

ATP: జిల్లాలో వచ్చే ఐదు రోజుల పాటు చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. పగటిపూట 30.5 నుంచి 32.5 డిగ్రీలు, రాత్రి 22.8 నుంచి 23.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందన్నారు. బోర్ల కింద వేరుశనగ సాగు చేసే రైతులు డిసెంబర్ 15 వరకు విత్తుకోవచ్చని సూచించారు.