హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి కేసుల నిందితురాలిపై పీడీ యాక్ట్

కడప నగరంలోని మాసాపేటకు చెందిన పూల లక్ష్మీదేవి (27)పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గతంలో ఆమెపై నమోదైన ఆరు గంజాయి కేసుల్లో మొత్తం 25.750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భవానీ వెల్లడించారు. వరుసగా గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యగా ఆమెపై నిర్బంధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.