కడప జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన మూడో రోజు 2,007 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల వ్యవధిలో సర్పంచ్ స్థానాలకు 1,366, వార్డు సభ్యుల స్థానాలకు 4,270 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా 5,636 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 5,636 నామినేషన్లు'


