W.G: ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ నందు పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. సీఐ కాళీ చరణ్, ఎస్సై శుభ శేఖర్ ఆధ్వర్యంలో సైలెన్సర్ లేని, సరైన రికార్డులు, నెంబర్ ప్లేట్లు లేని మోటార్ సైకిళ్లను ఆపి తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో పోలీసుల స్పెషల్ డ్రైవ్


