VSP: భీమిలి పాలిటెక్నిక్ కళాశాల ఫీడరు పరిధిలో విద్యుత్తు మరమ్మతుల దృష్ట్యా భీమిలిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్టు ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి బీచ్‌రోడ్డు, నేరెళ్లవలస కాలనీ, జగనన్న కాలనీ, ఎగువపేట, బోయివీధి, గొల్లవీధి, గంటస్తంభం కూడలి ప్రాంతాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


