హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 3 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

VSP: రుషికొండలోని శ్రీమహాలక్ష్మి సహిత శ్రీవెంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి శ్రీవారి 4వ వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకు వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.