VSP: ఆస్తి పన్ను సమస్యల పరిష్కారానికి మంగళవారం నుంచి రెండు రోజుల పాటు అన్ని జోన్లలో రెవెన్యూ మేళా నిర్వహించనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి అర్జీదారుల సమస్యలు పరిష్కరిస్తారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి రెవెన్యూ మేళా


