పల్నాడు: తిమ్మాపురంలో పావులూరి పిచ్చయ్య నామినేషన్ ర్యాలీలో మారణాయుధాలతో కనిపించారనే అనుమానంతో బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుతో సహా 67 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించిన విడుదల చేశారు. అనంతరం అందరికీ 41ఏ నోటీసులు జారీ చేసినట్లు ఏఎస్పీ హనుమంతరావు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
బాలకృష్ణ పీఏతో సహా 67 మందికి 41ఏ నోటీసులు


