హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు 3634 నామినేషన్లు

పల్నాడు: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. 189 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు 678, వార్డు సభ్యుల స్థానాలకు 2,956 చొప్పున మొత్తం 3,634 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు అత్యధికంగా 321 సర్పంచ్, 1,410 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదయ్యాయి.