హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎందువ కైలాసగిరి వద్ద గిరి ప్రదక్షిణ

SKLM: జి.సిగడాం మండలం ఎందువ కైలాసగిరి వద్ద గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటలకు ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ఎందువ నుంచి నడిమివలస, సేతుభీమవరం, గెడ్డకంచరాం మీదుగా తిరిగి స్వామి సన్నిధికి చేరుతుంది. సాయంత్రం కొండపై అఖండ జ్యోతి వెలిగించి పూజలు చేపడతామన్నారు.