SKLM: పోలాకి మండలం ఉరజాం గ్రామానికి చెందిన రోణంకి సింహాచలం (50) పాము కాటుకు గురై సోమవారం మృతి చెందారు. సాయంత్రం పొలంలో విత్తనాలు చల్లేందుకు వెళ్తుండగా పొలం గట్టు పక్కన ఉన్న పాము కాటేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. బాధిత కుటుంబ ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాముకాటుతో రైతు మృతి


