హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక

అన్నమయ్య: రాజంపేట పురపాలక సంఘంలో సోమవారం వాయిదా పడిన వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు రాజంపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఎన్నిక నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ తెలిపారు. రాజంపేట సబ్ కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి భావన ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.