హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కవాతు

కృష్ణా: బాపులపాడు మండలంలో ఈ నెల 26న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వీరవల్లి ఎస్సై సత్యం సురేష్ పోలీసులతో కలిసి రేమల్లె, సింగన్నగూడెం, కోడూరుపాడు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.