హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు సిద్దిపేటలో BJP మహా పాదయాత్ర

TG: BJP ఆధ్వర్యంలో సిద్దిపేటలో రేపు మహా పాదయాత్ర జరగనుంది. దీనిలో కేంద్రమంత్రి జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై ఇండియా కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు MP రఘనందన్ రావు చెప్పారు. SIRపై దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. నడ్డాతో పాటు TG BJP నేతలంతా ఈ యాత్రలో పాల్గొననున్నారు.