హైదరాబాద్: 28°C
వార్తలు

'న్యాయవాదుల నైతికతే న్యాయవ్యవస్థకు బలం'

న్యాయవ్యవస్థ గౌరవం, విశ్వసనీయత న్యాయవాదుల ప్రవర్తన, నైతిక విలువలపై ఆధారపడి ఉంటాయని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కోర్టుల్లోనే కాకుండా బయట కూడా న్యాయవాదులు వృత్తిపరమైన నైతికత పాటించాలని సూచించారు. ప్రజాదరణ, వాణిజ్య ప్రయోజనాల కోసం నైతికతను పక్కన పెట్టొద్దన్నారు. విమర్శలను సంయమనంతో వ్యక్తం చేయాలని.. నిజాయితీ, జవాబుదారీతనంతోనే న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పారు.