హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: SP దామోదర్

VZM: జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తృత భద్రతా చర్యలు చేపడుతున్నట్లు SP ఎ.ఆర్. దామోదర్ సోమవారం తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్లు, గ్రామసభలు, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సెక్యూరిటీ బాండ్లతో బైండోవర్ చేస్తున్నట్లు వెల్లడించారు.