KNR: నగునూరులోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శివలింగానికి ప్రదోషకాల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని శివలింగాన్ని దర్శించుకొని పూజలు చేశారు.
వార్తలు
VIDEO: నగునూరులో శివలింగానికి ప్రదోషకాల పూజలు


