హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోన్‌పే సౌండ్ బాక్స్ పేరుతో రూ.50 వేల టోకరా!

SDPT: ఫోన్‌పే సౌండ్ బాక్స్ ఇన్‌స్టాల్ చేస్తానంటూ గుర్తుతెలియని వ్యక్తి చికెన్ షాప్ యజమానికి రూ.50 వేలు దోచిన ఘటన మిరుదొడ్డిలో సోమవారం జరిగింది. ఫోన్‌పే ఉద్యోగినంటూ వచ్చిన వ్యక్తి బాక్స్ యాక్టివేషన్ పేరుతో యజమాని ఫోన్ తీసుకుని, స్కానర్‌తో లావాదేవీ చేస్తూ రూ.50 వేలు కాజేసినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో బాధితుడు 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు.