హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోడు భూముల నోటీసులపై బీజేపీ ఆగ్రహం

NZB: సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పోడు భూములకు ఫారెస్ట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గిరిజన రైతులకు సాగు పట్టాలు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఫారెస్ట్ భూముల పేరుతో వారి పొలాలను లాక్కునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.