హైదరాబాద్: 28°C
వార్తలు

పినపాకలో అభివృద్ధి కోసం మంత్రులను కలిసిన MLA

BDK: పినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో ముగ్గురు మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పంచాయతీరాజ్ పనులకు రూ.44 కోట్లు గిరిజన సంక్షేమానికి రూ.86 కోట్లు కోరారు. మణుగూరు ఆసుపత్రిని 150 పడకలకు, గుండాల పీహెచ్‌సీని 30 పడకలకు పెంచడంతో పాటు సారపాకలో కొత్త పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని కోరారు.