హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

NRML: నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేయాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సూచించారు. ట్రైనీ డీఎస్పీలతో కలిసి బస్టాండ్ పరిసరాలు, ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించారు. రోడ్ల ఆక్రమణలు, అక్రమ పార్కింగ్‌ను అరికట్టాలని, రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.