ADB: స్నానానికి వెళ్లి ఓ యువకుడు గల్లంతైన ఘటన గాదిగూడలో చోటుచేసుకుంది. ఎస్సై ఈశ్వర్ వివరాల ప్రకారం.. మండలంలోని బొడ్డిగూడ గ్రామపంచాయతీ సేడ్వాయి గ్రామానికి చెందిన కొడప భీంరావు(22) ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద స్నానానికి వెళ్ళాడు. చెరువు లోతుగా ఉండడంతో యువకుడు గల్లంతు కాగా.. ఈతగాళ్ల సహాయంతో ఎంత శోధించిన ఆచూకీ లభించడం లేదన్నారు.
తెలంగాణ
స్నానానికి వెళ్లి చెరువులో యువకుడి గల్లంతు


