హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘సాగులో నీటి పొదుపు పాటించాలి’

MHBD: ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మామిడి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న సూచించారు. సోమవారం గార్ల మండలం సీతంపేటలో మామిడి తోటలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు. మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్, సమతుల్య ఎరువుల వినియోగంతో నీటిని ఆదా చేస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించాలని తెలిపారు.