హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులోనే 'వృషకర్మ' ట్రైలర్ లాంచ్

NLR: అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన పౌరాణిక థ్రిల్లర్ 'వృషకర్మ' సినిమా డిసెంబరు 4న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 25న నెల్లూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.