హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు నిరసన

MBNR: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు జడ్చర్లలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఇంఛార్జ్ పల్లె తిరుపతి ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన నిరసనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బకాయిల విడుదల జాప్యంతో విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.