హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేసవికి ముందే నీటి ఎద్దడి భయాలు

MDCL: కీసర మండలంలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గత నెల రోజుల్లోనే సుమారు 3.4 మీటర్ల మేర నీటిమట్టం తగ్గినట్లు భూగర్భ జల శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే 40 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే వేసవిలో కీసర, శామీర్‌పేట మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.