NGKL: కల్వకుర్తి మండలం తాండ్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను సర్పంచ్ కాయితి ఆశదీప్ రెడ్డి సోమవారం హైదరాబాద్ విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బిర్లా మందిర్, గోల్కొండ కోట, ఎకో పార్కులను సందర్శించారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా చారిత్రక, విజ్ఞానపరమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలని సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు విజ్ఞాన విహారం.. హైదరాబాద్కు పర్యటన


