హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ధర్మారంలో కార్తీక పౌర్ణమి సందడి

PDPL: కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం ధర్మారంలో సందడి నెలకొంది. మంగళవారం కార్తీక పౌర్ణమి పండుగ కావడంతో వ్యాపారస్తులు పువ్వులు, ఉసిరికాయలు, మట్టి ప్రమిదలు విక్రయానికి ఉంచారు. వివిధ గ్రామాల ప్రజలు వస్తువులను కొనడానికి మండల కేంద్రానికి రావడంతో ప్రధాన రహదారి రద్దీగా మారింది. కిరాణా దుకాణాలు సైతం వినియోగదారులతో కిటకిటలాడాయి.