హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత

SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు మండల హరీష్‌ను ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామానికి చెందిన రాములు, సమ్మక్క దంపతులు కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చారు. అన్నప్రసాద సత్రంలో భోజనం అనంతరం బయటకు వెళ్తుండగా బాలుడు జనసందోహంలో తప్పిపోయాడు.