HNK: జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 83,384 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎర్ర కృష్ణారావు తెలిపారు. జిల్లాలో 496 కేంద్రాలను ఏర్పాటు చేసి 84,654 మంది చిన్నారులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన చిన్నారుల కోసం 2 రోజుల పాటు ఇంటింటి సర్వే చేపట్టి చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
తెలంగాణ
జిల్లాలో పల్స్ పోలియో వివరాలు


