హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైస్ ఛైర్మన్ పదవి దక్కలేదని కౌన్సిలర్ కన్నీళ్లు

CTR: పుంగనూరు మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన ఛైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 10వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఎం. ద్రాక్షాయణి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తతో కలిసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డామని తెలిపారు. వైస్ ఛైర్మన్ పదవి ఆశించినా దక్కకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.