హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నాతకోత్సవానికి రావాలని గవర్నర్‌కు ఆహ్వానం

HNK: కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవానికి హాజరుకావాలని గవర్నర్, వర్సిటీల ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లాను కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 28న జరగనున్న వేడుకల ఏర్పాట్లను వివరించారు. ఈ భేటీలో పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తదితరులు ఉన్నారు.