హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారం రోజుల్లో ముగ్గురు బాలికలు మృతి

మన్యం జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజన బాలికలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతోందో ప్రభుత్వం, అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుమ్మలక్ష్మీపురం కేజీబీవీ పాఠశాల విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.