ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే ప్రజా దివాస్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 మంది బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
తెలంగాణ
కమిషనరేట్లో ప్రజాదివాస్


