హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బైక్ లు ఢీ.. ఇరువురికి తీవ్రగాయాలు

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ఎదురెదురుగా అతివేగంగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయన్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయన్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.