హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పిల్లలను ఎండలో నిలబెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం

MHBD: అనంతారం మోడల్ స్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు స్వాగతం పలికేందుకు విద్యార్థులను ఎండలో నిలబెట్టడంపై అసహనానికి లోనయ్యారు. ఇంకెప్పుడూ పిల్లలను ఎండలో నిలబెట్టవద్దని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.