హైదరాబాద్: 28°C
వార్తలు

'5జీ టవర్‌తో పాత ఫోన్లకూ సిగ్నల్ ఇవ్వాలి'

ADB: గాదిగూడ మండలం అర్జునీ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన BSNL 5G టవర్ ద్వారా 2G, 3G, 4G మొబైల్ ఫోన్లకు కూడా నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని ప్రజలు కోరారు. సోమవారం BSNL ఏజీఎం బాబురావుకు వినతి పత్రం సమర్పించారు. ప్రతి ఒక్కరు 5G ఫోన్లు కొనుగోలు చేయడం ఆర్థికంగా ఇబ్బందికరమని, దీన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.