హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చేనేత కార్మికులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి'

NLG: జియో ట్యాగింగ్‌తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న చేనేత, అనుబంధ వృత్తుల కార్మికులందరికీ ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో కేవలం 465 మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేశారని, అర్హులందరికి అందించాలని కోరారు.