హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామసర్పంచ్‌గా వీరనారాయణ ప్రమాణ స్వీకారం

ప్రకాశం: మరిపూడి మండలం కెల్లంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా రేగుల వీరనారాయణ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వీరనారాయణ సర్పంచ్‌గా తన స్వగ్రామంలో నామినేషన్ వేయడంతో ప్రత్యర్థులు సైతం వీరనారాయణ మద్దతు పలికి ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.