ASR: డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ రెండో వార్డు సభ్యుడి అభ్యర్థిగా అర్జీ ఆనందరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు సంబంధించిన రుసుములను పూర్తిగా చిల్లర నాణేల రూపంలో చెల్లించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభ్యర్థి తీసుకొచ్చిన నాణేలను ఆర్వో నాని బాబు లెక్కించి స్వీకరించారు. నామినేషన్ రుసుమును నాణేల రూపంలో చెల్లించడంతో అక్కడున్న వారు ఆసక్తిగా గమనించారు.
ఆంధ్రప్రదేశ్
చిల్లర నాణేలతో నామినేషన్ రుసుము చెల్లింపు


