KMR: రామారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం విద్యార్థినులకు HPV వ్యాక్సినేషన్ వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సురేశ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా 14 సంవత్సరాల బాలికలకు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ రాకుండా ఉండేందుకు HPV వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
బాలికలకు HPV వ్యాక్సినేషన్


