హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొబ్బరి తోటల పునరుద్ధరణకు కార్యాచరణ: కలెక్టర్

కోనసీమ: అర్నాబ్ తుఫాన్ దాటికి దెబ్బతిన్న కొబ్బరి తోటలు పునరుద్ధరణకు శాస్త్రీయ విధానాలతో సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన ప్రతి చెట్టును అంచనా వేసి 4 రోజులలో SOP సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.