హైదరాబాద్: 28°C
తెలంగాణ

26న కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మికుల ధర్నా

BDK: వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు రేసు ఎల్లయ్య, కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు తెలిపారు. ఉపాధి హామీ పనిదినాలు 200కు పెంచాలని, రోజువారీ వేతనం రూ.700 చేయలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం మరిచాయని విమర్శించారు.